-
-
Home » Andhra Pradesh » Nellore » old students meet at nellore-MRGS-AndhraPradesh
-
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ABN , First Publish Date - 2022-05-15T03:56:58+05:30 IST
మండలంలోని నిడిగుంటపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 ఏళ్ల కిందట 1981-82 విద్యా సంవత్సరంలో పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.
వెంకటాచలం, మే 14 : మండలంలోని నిడిగుంటపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 ఏళ్ల కిందట 1981-82 విద్యా సంవత్సరంలో పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 45 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. చేవూరు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు డీ రాధాకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40 ఏళ్ల కిందట కలిసి చదువుకున్న విద్యార్థులందరూ ఒక్కసారిగా తిరిగి కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆదినారాయణ తెలిపారు. తమందరం కలిసి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఏదో ఒక విధంగా తమవంతు సాయం అందిస్తామన్నారు. అనంతరం విశ్రాంత హెచ్‌ఎం రాధాకృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు.

