-
-
Home » Andhra Pradesh » Nellore » nrp pramodkumar shahoo-MRGS-AndhraPradesh
-
ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయి పరిశీలన
ABN , First Publish Date - 2022-05-15T03:54:09+05:30 IST
మండలంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
రైతులతో ఎన్‌ఆర్‌పీ ప్రమోద్ కుమార్ సాహు ముఖాముఖి
దగదర్తి, మే 14 : మండలంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వివిధ పంటలను పరిశీలించి, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మహిళా కిసాన్ స్వశక్తి ప్రయోజన్ కేంద్ర బృందం నుంచి నేషనల్ రీసోర్స్‌పర్సన్ ప్రమోద్ కుమార్ సాహు, ఎల్‌హెచ్ ఏపీఎం నాగేంద్ర ప్రసాద్, ఏపీసీఎన్‌ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ కల్పన చెన్నూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించారు. స్థానిక రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 8 మంది రైతులతో మాట్లాడి, వారు అనుచరిస్తున్న సాగు పద్ధతులను తెలుసుకున్నారు. ఎన్‌పీఎం షాప్‌లను సందర్శించి, రికార్డులు తనిఖీ చేశారు. సూర్య మండల మోడల్స్, మామిడితోటలో అంతర పంటలు, 365 కిచెన్ గార్డెన్స్‌ను పరిశీలించారు. జీవామృతం డెమోను పరిశీలించి, గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ప్రసాద్, ఏపీసీఎన్‌ఎఫ్ ఎంటీ పున్నారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

