హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-05-15T02:41:41+05:30 IST

మండల పరిధిలోని వేగూరుకి చెందిన నావూరు పోలయ్యను ఈ నెల 9న హత్యచేసేం దుకు ప్రయత్నించిన ముగ్గురు

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

 కోవూరు, మే15 :  మండల పరిధిలోని వేగూరుకి చెందిన నావూరు పోలయ్యను ఈ నెల 9న హత్యచేసేం దుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ డీ వేంకటేశ్వరరావు తెలిపారు. పోలీసుస్టేషన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9వతేదీన నెల్లూరులో పనిచూసుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న నావూరు పోలయ్యను రాత్రి 7.30 గంటల సమయంలో వేగూరుకి చెందిన చెంగల నాగరాజు, పాటూరు పవన్‌, గంగపట్నం మహేష్‌ దారి కాచి కారంపొడి కళ్లల్లో చల్లి రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. స్ధానికులు అడ్డుకోవడంతో నిందితులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోలయ్యను నెల్లూరులోని వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు.ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుల్ని గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. 



Read more