గోనుపల్లిలో మూతపడిన మద్యం దుకాణాలు
ABN, First Publish Date - 2022-05-15T02:44:58+05:30
మండలంలోని గోనుపల్లిలో ఉన్న రెండు మద్యం దుకాణాలను శనివారం మూసివేశారు. ఉత్సవాలు జరుగుతున్నా మూత
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
రాపూరు, మే 14: మండలంలోని గోనుపల్లిలో ఉన్న రెండు మద్యం దుకాణాలను శనివారం మూసివేశారు. ఉత్సవాలు జరుగుతున్నా మూతపడని బ్రాందీషాపులు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో శనివారం కథనం ప్రచురితమైంది. కాగా శనివారం నృసింహజయంతి, ఆదివారం కల్యాణో త్సవం జరగనుండడంతో బ్రాందీషాపులను మూసివేశారు. అయితే బ్రాందీషాపులు మూసివేయడంతో అనధికార దుకాణాలు వెలసినట్లు, రెట్టింపు రేట్లతో అమ్మకాలు జరిగినట్లు సమాచారం.