రేపో, మాపో కూలనున్న ప్రభుత్వం : పోలంరెడ్డి

ABN , First Publish Date - 2022-05-15T02:37:58+05:30 IST

దోపిడీ రాజ్యం.. దొంగ ప్రభుత్వం... రేపో, మాపో కూలక తప్పదని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గం

రేపో, మాపో కూలనున్న ప్రభుత్వం : పోలంరెడ్డి
మాట్లాడుతున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

ఇందుకూరుపేట, మే 14 : దోపిడీ రాజ్యం.. దొంగ ప్రభుత్వం... రేపో, మాపో కూలక తప్పదని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గంగపట్నం, పల్లిపాలెంలో శనివారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ ఈ మూడేళ్ల పాలన లో ఇప్పటి వరకు ఒక్క పంటలో కూడా రైతు లాభం పొందలేక పోయాడని దుయ్యబట్టారు.  ఇకనైనా ప్రజలు ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరేంద్రచౌదరి, మునగాల రంగారావు, పేడూరు రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Read more