-
-
Home » Andhra Pradesh » Nellore » enttori janmadini vedukalu-MRGS-AndhraPradesh
-
ఘనంగా ఇంటూరి జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2022-05-15T02:31:49+05:30 IST
టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ జన్మదిన వేడుకలను శనివారం ఆయన అనుచరులు, అభిమాను
కందుకూరు, మే 14: టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ జన్మదిన వేడుకలను శనివారం ఆయన అనుచరులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఆయన అభిమాన యువకులు పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతోపాటు పామూరు రోడ్డులోని కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకృషి దివ్యాంగుల పాఠశాలలో కేక్ కట్‌చేసి, చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పట్టణంలోని యాచకులు, నిరుపేదలు, సంచార జాతుల వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. మైనారిటీ నాయకులు జియావుద్ధీన్, ఖాదర్ తదితరుల ఆధ్వర్యంలో ముస్లింలు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

