ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చర్యలు : డీఎస్పీ

ABN, First Publish Date - 2022-05-15T04:04:44+05:30

సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కావలి ఇన్‌చార్జి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు డీఎస్పీ కే. శ్రీనివాసులు హెచ్చరించారు.

మాట్లాడుతున్న కావలి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలి, మే 14: సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కావలి ఇన్‌చార్జి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు డీఎస్పీ కే. శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ఏవీఎస్‌ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం బెల్లం వ్యాపారులతో నిర్వహించినసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కావలి పరిసర ప్రాంతాల్లో సారా తయరీదారులు ఎక్కువైనట్లు పోలీసులు గుర్తించారన్నారు, సారా తయారీకి నల్లబెల్లం ఎక్కువగా వాడుతారని, నాటు సారా నిర్మూలనకు సహకరించి నల్లబెల్లం విక్రయించవద్దని తెలిపారు. ఒక వేళ నల్లబెల్లం సారా తయారీ దారులకు అమ్మితే తాము సారా తయారీ దారులను పట్టుకున్నపుడు వారు పలానా దుకాణం వద్ద బెల్లం కొనుగోలు చేసినట్లు చెపితే అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. వ్యాపారస్థుల ప్రతినిధి తిరువీధి ప్రసాద్‌ మాట్లాడుతూ నల్లబెల్లం నాటు సారా తయారీకే కాకుండా రొయ్యల చెరువులకు, పత్తి చేలకు, ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారన్నారు. తాము నల్లబెల్లం సారా తయారీ దారులకు అమ్మకుండా సహకరిస్తామని వ్యాపారులు తెలిపారు. అయితే ఇటీవల ఎక్సైజ్‌  అధికారులు   బెల్లం వ్యాపారులను తమ అమ్మకాలపై రోజూ వారి నివేదికలు ఇవ్వమని అడిగారని అది సరికాదన్నారు. ఈ విషయం తాను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లతానని డీఎస్పీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు నాగరాజు, అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!