-
-
Home » Andhra Pradesh » Nellore » dsp srinivasulu meeting at kavali-MRGS-AndhraPradesh
-
సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చర్యలు : డీఎస్పీ
ABN , First Publish Date - 2022-05-15T04:04:44+05:30 IST
సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కావలి ఇన్చార్జి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు డీఎస్పీ కే. శ్రీనివాసులు హెచ్చరించారు.
కావలి, మే 14: సారా వ్యాపారులకు నల్లబెల్లం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కావలి ఇన్చార్జి డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు డీఎస్పీ కే. శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ఏవీఎస్ కల్యాణ మండపంలో శనివారం సాయంత్రం బెల్లం వ్యాపారులతో నిర్వహించినసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కావలి పరిసర ప్రాంతాల్లో సారా తయరీదారులు ఎక్కువైనట్లు పోలీసులు గుర్తించారన్నారు, సారా తయారీకి నల్లబెల్లం ఎక్కువగా వాడుతారని, నాటు సారా నిర్మూలనకు సహకరించి నల్లబెల్లం విక్రయించవద్దని తెలిపారు. ఒక వేళ నల్లబెల్లం సారా తయారీ దారులకు అమ్మితే తాము సారా తయారీ దారులను పట్టుకున్నపుడు వారు పలానా దుకాణం వద్ద బెల్లం కొనుగోలు చేసినట్లు చెపితే అలాంటి వారిపై చర్యలు తప్పవన్నారు. వ్యాపారస్థుల ప్రతినిధి తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ నల్లబెల్లం నాటు సారా తయారీకే కాకుండా రొయ్యల చెరువులకు, పత్తి చేలకు, ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారన్నారు. తాము నల్లబెల్లం సారా తయారీ దారులకు అమ్మకుండా సహకరిస్తామని వ్యాపారులు తెలిపారు. అయితే ఇటీవల ఎక్సైజ్ అధికారులు బెల్లం వ్యాపారులను తమ అమ్మకాలపై రోజూ వారి నివేదికలు ఇవ్వమని అడిగారని అది సరికాదన్నారు. ఈ విషయం తాను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లతానని డీఎస్పీ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ కే.శ్రీనివాసరావు, ఎస్ఐలు నాగరాజు, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

