బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు

ABN , First Publish Date - 2022-11-07T23:25:35+05:30 IST

బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేశారు.

బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంఘాలు

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 7 : బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కేసీ పెంచలయ్య మాట్లాడుతూ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. జీవో నెంబరు 52ను, శామ్యూల్‌ ఆనందకుమార్‌ ఏకసభ్య కమిషన్‌ను రద్దు చేయాలన్నారు. అంతకు ముందు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గిరిజనులతో పాటు నాయకులు మానుపాట నవీన్‌, బీఎల్‌ శేఖర్‌, రాపూరు కృష్ణయ్య, చౌటూరు శీనయ్య, పోలయ్య, పోట్లూరు శ్రీనివాసులు, చూవూరు సుబ్బారావు, బూదూరు కేశవరామ్‌, చెంబేటి ఉష, సుమతి, ఏకొల్లు లక్ష్మి, సత్యవతి, కళావతి, జయలక్ష్మి, రాపూరు రాధమ్మ, కలుగోలమ్మ తదితరులు పాల్గొన్నారు.

దళిత సంఘర్షణ సమితి సంఘీభావం

బోయలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని గిరిజన ఐక్యకార్యాచరణ కమిటీ చేపట్టిన ధర్నాకు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి, నాయకులు సంఘీభావం తెలిలి ధర్నాలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:25:35+05:30 IST

Read more