చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-05-15T02:39:41+05:30
మండలంలోని రేగడిచెలిక వద్ద శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా తీవ్రంగా
కొడవలూరు, మే 14: మండలంలోని రేగడిచెలిక వద్ద శుక్రవారం రాత్రి మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా తీవ్రంగా గాయపడ్డారు.అతన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు వైధ్యశాలలో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పొలీసుల కథనం మేరకు, దగదర్తి మండలం కౌరగుంటకు చెందిన అంబటి వీరాస్వామి (27) శుక్రవారం నెల్లూరు నుంచి మోటార్ సైకిల్‌పై కౌరగుంటకు వెళుతుండగా, మార్గమధ్యంలో రేగడిచెలిక జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతన్ని 108లో నెల్లూరుకు తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ఎస్‌ఐ సుబ్బారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.