-
-
Home » Andhra Pradesh » Nellore » cakkera fatctny kaapaadanda-MRGS-AndhraPradesh
-
కోవూరు చక్కెర కర్మాగారాన్ని కాపాడాలి
ABN , First Publish Date - 2022-05-15T02:47:37+05:30 IST
కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా నాయకులు శనివారం కోవూరు, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు న
కోవూరు, మే14 : కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని కాపాడాలని సీపీఎం జిల్లా నాయకులు శనివారం కోవూరు, నెల్లూరు నగర ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లకు వినతిపత్రాల్ని సమర్పించారు. సీపీఎం నాయకులు చండ్ర రాజగోపాల్, గండవరపు శీనయ్య నాయకత్వంలో పలువురు నాయకులు శాసనసభ్యులను కలిసి ఫ్యాక్టరీ దుస్థితిని గురించి వివరించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేయాల్సిందిగా కోరారు.

