21 నుంచి కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-08T03:25:13+05:30 IST

జొన్నవాడ కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మో

21 నుంచి కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు
కామాక్షితాయి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ప్రసన్న, ఆలయ చైర్మెన్‌, ఈవో తదితరులు

పోస్టర్ల ఆవిష్కరణ

బుచ్చిరెడ్డిపాళెం,మే7:   జొన్నవాడ కామాక్షితాయి  వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు  జరగనున్నాయి.  బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  శనివారం బుచ్చి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో  ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో డీ వెంకటేశ్వర్లు,  ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.


 సెంట్రల్‌ లైటింగ్‌కు రూ. 2 కోట్లు


బుచ్చిలోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద నుంచి మలిదేవి బ్రిడ్జి వరకు,  తహసీల్దారు కార్యాలయం సెంటర్‌ నుంచి  డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూలు వరకు  రూ. 2కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సీఎం అభివృద్ధి నిధుల కింద నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు  ఎమ్మెల్యే  తెలిపారు. ఈ ఉత్తర్వులను చైర్‌పర్సన్‌ మోర్ల సుప్రజకు ఆయన అందజేశారు.


 కామాక్షితాయి సేవలో హైకోర్టు న్యాయమూర్తి


జొన్నవాడ ఆలయంలో హైకోర్టు న్యాయమూర్తి కే. విజయలక్ష్మి దంపతులు శనివారం మల్లికార్జునస్వామి, కామాక్షితాయి వార్లను దర్శించుకున్నారు.  ఆలయ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో డీ వెంకటేశ్వర్లు, అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం  శేష వస్ర్తాలతో వారిని సత్కరించారు. వారి వెంట రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు.

Read more