ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP CID : నాలుగు రోజులుగా Narayana ఫోన్ స్విచాఫ్.. అజ్ఞాతంలోకి.. ఇవాళిలా అరెస్ట్

ABN, First Publish Date - 2022-05-10T18:12:13+05:30

నాలుగు రోజులుగా Narayana ఫోన్ స్విచాఫ్.. అజ్ఞాతంలోకి.. ఇవాళిలా అరెస్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్/అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ (TDP) కీలక నేత నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని నారాయణ నివాసంలోనే అదుపులోకి తీసుకుని.. ఆయన కారులోనే ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. టెన్త్‌ పేపర్ లీకేజీ వ్యవహారంలోనే సీఐడీ అదుపులోకి తీసుకున్నది. అయితే.. గత 4 రోజులుగా నారాయణ (Narayana) ఫోన్‌ స్విచాఫ్ చేసి.. అజ్ఙాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. టెన్త్ పరీక్ష పేపర్లు (Tenth Exams) చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు నారాయణను కూడా చిత్తూరు పొలుసులు, సీఐడీ అధికారులు అదుపులో తీసుకున్నారు.


ఎక్కడెక్కడ కేసులు..!

మాల్‌ ప్రాక్టీస్‌ నిరోదక చట్టం 408 ఐపిసి కింద నారాయణ విద్యాసంస్థలపై పలు కేసులు నమోదయ్యాయి. మండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో ఇప్పటికే 15 మంది అధ్యాపకులను పోలీసులు (Police) అరెస్ట్‌ చేశారు. అయితే వారందరికీ వెంటనే కోర్టు బెయిల్‌ ఇచ్చింది. మండవల్లి నుంచి పసుమర్రుకు, అక్కడ నుంచి ఉయ్యూరులోని నారాయణ స్కూలుకు వస్తున్నాయని అప్పట్లో ప్రచారం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో కూడా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ కలిపి ప్రభుత్వం సీఐడీకి (CID) ఇచ్చారని సమాచారం. 


సెక్షన్లు ఇవీ..

కాగా.. పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజ్‌ (Leakage) కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదయ్యింది. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు కృష్ణాజిల్లా మండవల్లిలో కేసులు నమోదయ్యాయి. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్‌ నెంబరు 111/2022 కింద కేసు నమోదు అయ్యింది. కృష్ణాజిల్లా మండవల్లిలో ఈ నెల 2న ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 141/2022 కింద కేసు నమోదయ్యింది. కాగా.. నారాయణతో పాటు ఆయన సతీమణి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.





సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!