ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు?: MLC Mantena

ABN, First Publish Date - 2022-05-06T17:14:51+05:30

మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయని ఎమ్మెల్సీ మంతెన విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

Amaravati: మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, నష్టం చేకూర్చేలా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా చెబుతుంటే.. ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతమని అన్నారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి వ్యవహరిస్తున్నారని అన్నారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక  రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారా? అని నిలదీశారు. తన భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!