-
-
Home » Andhra Pradesh » MLC Mantena comments-MRGS-AndhraPradesh
-
ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరు?: MLC Mantena
ABN , First Publish Date - 2022-05-06T17:14:51+05:30 IST
మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా ఉన్నాయని ఎమ్మెల్సీ మంతెన విమర్శించారు.
Amaravati: మంత్రి రోజా భర్త సెల్వమణి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచేలా, నష్టం చేకూర్చేలా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సినిమా షూటింగులు వద్దని చెప్పడానికి సెల్వమణి ఎవరని ప్రశ్నించారు. ఓ వైపు రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి రోజా చెబుతుంటే.. ఆమె భర్త మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సెల్వమణి వ్యాఖ్యలు దేనికి సంకేతమని అన్నారు. రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత తన భర్తను లెక్క చేయడం లేదేమో అందుకే రోజాకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా సెల్వమణి వ్యవహరిస్తున్నారని అన్నారు. తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోలేని రోజా ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పొరుగు రాష్ట్రాల్లో పర్యటించడం తప్ప రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతాన్ని సందర్శించారా? అని నిలదీశారు. తన భర్త సెల్వమణి చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా తక్షణమే క్షమాపణ చెప్పాలని మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు.

