ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎంపీని మోసం చేసిన కేసులో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2022-05-15T05:09:10+05:30

కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ను ఆన్‌లైన్‌లో మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నిందితులు జార్ఖండ్‌ వాసులు 


కర్నూలు, మే 14: కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ను ఆన్‌లైన్‌లో మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి ఈ కేసును కర్నూలు సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. పది రోజుల క్రితం కర్నూలు ఎంపీ సంజీవకుమార్‌కు పాన్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలని ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి ఓటీపీ తదితర వివరాలు తీసుకున్నాడు. ఆ వెంటనే ఎంపీ అకౌంట్‌లో నుంచి రూ.97వేల నగదు డ్రా అయింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఎంపీ కర్నూలు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎంపీ సంజీవకుమార్‌కు వచ్చిన ఫోన్‌ కాల్స్‌, నగదు జమ అయిన బ్యాంకు అకౌంట్‌ తదితర వివరాలతో నిందితులు జార్ఖండ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని జార్ఖండ్‌కు పంపారు. అక్కడికి వెళ్లిన ఈ బృందం నిందితులు కమలేష్‌, నరేష్‌ అనే ఇద్దరు వ్యక్తులను కర్నూలుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్‌లోని కొన్ని గ్రామాల్లో ఇదే తరహాలో పెద్ద ఎత్తున యువకులు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఐదారు మంది గ్రూపుగా ఏర్పడి ఇలా ఫోన్‌ కాల్స్‌ చేసి ఆన్‌లైన్‌లో నగదును స్వాహా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్టు అయిన వ్యక్తుల్లో ఒకరు జార్ఖండ్‌లోని ఓ గ్రామానికి పెద్దగా ఉన్నట్లు తెలిసింది. ఆయన కొడుకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. అరెస్టు అయిన యువకులను పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తే మరికొన్ని సైబర్‌ నేరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!