నిజంగానే తెల్ల బంగారం

ABN , First Publish Date - 2022-05-14T05:31:43+05:30 IST

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

నిజంగానే తెల్ల బంగారం

ఆదోనిలో రికార్డు స్థాయిలో పత్తి ధర 

క్వింటం రూ.13,117 


ఆదోని (అగ్రికల్చర్‌) మే 13: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో క్వింటం మీద రూ. 800లకుపైగా పెరిగింది. శుక్రవారం పత్తి ధర గరిష్ఠంగా రూ.13.177 పలికింది. దేశంలోని ఏ ఇతర వ్యవసాయ మార్కెట్‌యార్డులో పలకని ధరలు ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పలుకుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే రికార్డుస్థాయి ధర. 200 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ.7,506, గరిష్ఠ ధర రూ.13,117 మధ్య ధర రూ.11,879 పలికింది. 

Read more