చికిత్స పొందుతూ యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-05-14T05:51:39+05:30 IST

పట్టణ శివార్లలోని ఆటో నగర్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షరీఫ్‌ (28) అనే యువకుడు శుక్రవారం కోలుకోలేక మృతి చెందాడు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మకూరు, మే 13: పట్టణ శివార్లలోని ఆటో నగర్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన షరీఫ్‌ (28) అనే యువకుడు శుక్రవారం కోలుకోలేక మృతి చెందాడు. ఆత్మకూరు మండలం అమలా పురం గ్రామానికి చెందిన షరీఫ్‌ కార్పెంటర్‌గా పని చేస్తూ జీవించేవాడు. గురువారం మధ్యాహ్నం పని ముగించుకుని భోజనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. తిరిగి పనికి వచ్చేందుకు బైక్‌పై బయలు దేరగా ఆత్మకూరు పట్టణ శివార్లలోని ఆటో నగర్‌ వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్‌ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో షరీఫ్‌ గాయ పడటంతో అతన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి చికిత్సలు అందజేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించగా అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూరు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.


Read more