మూడో రోజు జోరు వాన
ABN, First Publish Date - 2022-05-15T05:04:35+05:30
అసాని తుపాను ప్రభావంతో జిల్లాలో మూడురోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
కర్నూలు (అగ్రికల్చర్), మే 14: అసాని తుపాను ప్రభావంతో జిల్లాలో మూడురోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం గోనెగండ్లలో 56 ఎంఎం వర్షం నమోదైంది. దేవనకొండలో 32.4 ఎంఎం, సీ.బెళగల్‌లో 29.8 ఎంఎం, ప్యాపిలిలో 23.8, తుగ్గలిలో 17.6, క్రిష్ణగిరిలో 16.4, మద్దికెరలో 15.2, కోడుమూరులో 10.8, ఆస్పరి మండలంలో 10 ఎంఎం వర్షం నమోదైంది.