‘తాగునీటి సమస్యను పరిష్కరించండి’

ABN , First Publish Date - 2022-05-15T05:06:47+05:30 IST

తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కాలనీవాసులు విన్నవించారు.

‘తాగునీటి సమస్యను పరిష్కరించండి’

 

పెద్దకడుబూరు, మే14: తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని కాలనీవాసులు విన్నవించారు. శనివారం మండల పరిధిలోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చిన్నకడబూరులో నిర్వహించారు. ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ప్రదీ్‌పరెడ్డి గడప గడపకు తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు తమకు తాగునీటి సమస్య పరిష్కారించాలని కోరారు. నాగయ్య అనే వ్యక్తి కూతురుకు అమ్మ ఒడి రాలేదని కోరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

Read more