-
-
Home » Andhra Pradesh » Kurnool » Replacement of MLHP posts from tomorrow-MRGS-AndhraPradesh
-
రేపటి నుంచి ఎంఎల్‌హెచపీ పోస్టుల భర్తీ
ABN , First Publish Date - 2022-05-15T04:18:25+05:30 IST
కడప జోన పరిధిలో ఖాళీగా ఉన్న 1368 మిడ్ లెవెల్‌హెల్త్ ప్రొవైడర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నెల 16 నుంచి భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కడప రీజినల్ డైరెక్టర్ డా.హైమావతి ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలు(హాస్పిటల్), మే 14: కడప జోన పరిధిలో ఖాళీగా ఉన్న 1368 మిడ్ లెవెల్‌హెల్త్ ప్రొవైడర్ల పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నెల 16 నుంచి భర్తీ చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కడప రీజినల్ డైరెక్టర్ డా.హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఈ పోస్టుల కౌన్సెలింగ్ కడప డీఎంహెచవో కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఈ నెల 16వ తేదీన మెరిట్‌లిస్టు 1 నుంచి 200, 17న 201 నుంచి 500, 18న మెరిట్ లిస్టు 551 నుంచి 900, 19న మెరిట్ లిస్టు నెంబరు 901 నుంచి 1746 వరకు ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
కడప జోన-4 పరిధిలోని గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న ఎంఎల్‌హెచపీలకు ఈ నెల 16న కడప డీఎంహెచవో కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కడప ఆర్డీ ఆదేశాలు జారీ చేశారు. ఎంఎల్‌హెచపీలు మెరిట్‌తోపాటు బదిలీల దరఖాస్తులు సమర్పించాలి.

