రోడ్డు ప్రమాదంలో ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-15T05:14:36+05:30 IST

మండలంలోని వెలుగోడు-రేగడగూడూరు మధ్యలో గల కేసీ కెనాల్‌ వంతెన వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో నాగభూషణం(26) అనే ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి

ఆత్మకూరు(వెలుగోడు), మే 14: మండలంలోని వెలుగోడు-రేగడగూడూరు మధ్యలో గల కేసీ కెనాల్‌ వంతెన వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో నాగభూషణం(26) అనే ప్రొటెక్షన్‌ వాచర్‌ మృతి చెందాడు. మిడ్జూరు మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన నాగభూషణం వెలుగోడులో వాచ్‌టవర్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద ప్రొటెక్షన్‌ వాచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం బైక్‌పై విధులకు వెళ్తుండగా వెలుగోడు-రేగడగూడూరు మధ్యలో కేసీ కెనాల్‌ వంతెనను ఢీకొని కెనాల్‌లో పడ్డాడు. అయితే కెనాల్‌లో నీరు లేకపోవడంతో తలకు బలమైన రాయి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read more