‘వైసీపీని బాదేందుకు ప్రజలు సిద్ధం’

ABN , First Publish Date - 2022-05-15T05:00:45+05:30 IST

రాబోయే ఎన్నికల్లో వైసీపీని బాదేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులను, ఎమ్మెల్యేలను జనం నిలదీయడమే దీనికి నిదర్శనమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

‘వైసీపీని బాదేందుకు ప్రజలు సిద్ధం’
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ జడ్పీ చైర్మన మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, మే 14: రాబోయే ఎన్నికల్లో వైసీపీని బాదేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులను, ఎమ్మెల్యేలను జనం నిలదీయడమే దీనికి నిదర్శనమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన మల్లెల రాజశేఖర్‌ అన్నారు. శనివారం మండలంలోని కొమరోలు గ్రామంలో తిరుణాల సందర్భంగా వెంకటేశ్వరస్వామిని వారు దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేదే గానీ.. తగ్గేదిలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం జగనపై రగిలిపోతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యతకు మంచి రోజులు రావాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించుకోలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇక సాగనంపాలన్నారు. గడప గడపలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఏమి చేశారని నిలదీస్తుంటే.. సమాధానం చెప్పుకోలేక జారుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు మహబూబ్‌ బాషా, భాస్కర్‌ రెడ్డి, రామకృష్ణ, రమేష్‌, మల్లేష్‌, అశ్వత్థనారాయణ, జయన్న పాల్గొన్నారు.



Read more