మహానందీశ్వరుడి హుండీ ఆదాయం రూ.34 లక్షలు
ABN, First Publish Date - 2022-05-14T05:34:37+05:30
మహానంది క్షేత్రంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ. 34,16,203 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలి పారు
మహానంది, మే 13: మహానంది క్షేత్రంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ. 34,16,203 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి తెలి పారు. ఆలయం ప్రాంగణంలోని అభిషేక మంటపంలో సిబ్బంది సహాయంతో ఉభయ ఆలయాలల్లోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.55160, గోవు సంరక్షణ హుండీ ద్వారా రూ. 33,256 ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ ఏఈఓ ఎర్రమల్ల మధు, గ్రూపు దేవాలయాల ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కు మార్‌రెడ్డి, సూపరిం టెండెంట్ వెంకటేశ్వర్లు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగమల్లయ్య, శశిధర్‌రెడ్డి, క్యాషియర్ నాగభూషణం పాల్గొన్నారు.