ధరలు తగ్గించడం చేతగాదా..?

ABN , First Publish Date - 2022-05-15T04:16:34+05:30 IST

నిత్యావసరాలన్నిటి ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నా వాటిని తగ్గించడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాదా అని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రశ్నించారు.

ధరలు తగ్గించడం చేతగాదా..?
చంద్రబాబు సభ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు

  1.  సామాన్యుల బాధలు పట్టని వైసీపీ 
  2. చంద్రబాబు పర్యటనతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి 
  3. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి 


డోన, మే 14: నిత్యావసరాలన్నిటి ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నా వాటిని తగ్గించడం వైసీపీ ప్రభుత్వానికి చేత కాదా అని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రశ్నించారు. శనివారం డోన పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డితో కలిసి గౌరు వెంకటరెడ్డి విలేకరులతో మాట్లా డారు. వైసీపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో వైసీపీ పునాదులు కదిలిపోతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చెబు తున్న సంక్షేమమంతా బూటకమని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. ఈ మూడేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని వైసీపీకి సవాల్‌ విసిరారు. ఈ నెల 19న డోన నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో జరిగే బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని గౌరు వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, మన్నెగౌతం రెడ్డి, టీడీపీ నంద్యాల పార్లమెంటు అధికార ప్రతినిధి విజయభట్టు, కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, నంద్యాల జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, డోన పట్టణ టీడీపీ అధ్యక్షులు సీఎం శ్రీనివాసులు, డోన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, లక్ష్మీనారాయణ యాదవ్‌, మధుసూదన రెడ్డి, గోవిందరెడ్డి, మల్లయ్య, కుమ్మరి సుధాకర్‌, ఎల్‌ఐసీ శ్రీరాములు, రామాంజినేయులు పాల్గొన్నారు.

చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ప్యాపిలి, మే 14: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామంలో ఈ నెల 19న నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన ఏర్పాట్లను టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, టీడీపీ డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల ఫెడరేషన చైర్మన వై.నాగేశ్వరరావుయాదవ్‌  పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, టీడీపీ నాయకులు ఆర్‌ఈ రాఘవేంద్ర, గండికోట రామసుబ్బయ్య, రాజశేఖర్‌నాయుడు, రమణగౌడు, నబీ రసూల్‌, తిరుపాలునాయుడు, శ్రీకాంతనాయుడు, విష్ణువర్ధన, సలాం, గార్లదిన్నె సుధాకర్‌, ఘనమద్దయ్య తదితరులు పాల్గొన్నారు. 


Read more