ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
ABN, First Publish Date - 2022-05-14T05:46:56+05:30
మండలంలోని తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లను నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గోస్పాడు, మే 13: మండలంలోని తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లను నంద్యాల కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిషత్ కార్యాలయ అధికారులతో మాట్లాడుతూ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది పనితీరు, సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్యం, తాగునీరు సమస్యల గురించి చర్చించారు. తహసీల్దార్ కార్యాలయంలో జగనన్న కాలనీలకు సంబంధించిన లే అవుట్లను పరిశీలించి, ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించి, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుగుణ శ్రీ, ఈవోఆర్డీ నాగేంద్ర, ఎస్‌ఐ నాగరాజు ఉన్నారు.