‘ప్రభుత్వం మోసాలపై పోరాటం’

ABN , First Publish Date - 2022-05-15T05:09:15+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న మోసాలపై టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్లు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు.

‘ప్రభుత్వం మోసాలపై పోరాటం’


కల్లూరు, మే 14: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న మోసాలపై టీడీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయనున్నట్లు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన నివాసంలో టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరమణ నాయక్‌, నంద్యాల పార్లమెంటు ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు హెచ.కృష్ణా నాయక్‌ ఆధ్వర్యంలో గౌరు వెంకటరెడ్డిని శాలువలో ఘనంగా సన్మానించారు. టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర కమిటీలో తమకు అవకాశం కల్పించినందుకు గౌరు వెం కటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ వ్యతిరేకవిధానాలపై గిరిజనులను ఏకీకృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుణ్‌ కుమార్‌, నంద్యాల పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి వెంకట్రాముడు, రాజు నాయక్‌, జయనాయక్‌, ఈశ్వర్‌ నాయక్‌, హనుమంతు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

  మాజీ సర్పంచుకు గౌరు చరిత పరామర్శ

కల్లూరు మండలం ఉలిందకొండ మాజీ సర్పంచ పరమే్‌షను మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇనచార్జి గౌరు చరిత పరామార్శించారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ అమీలియో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సర్పంచు పరమే్‌షను ఆమె పరామార్శించి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆమె డాక్టర్లను కోరారు. ఆమె వెంట టీడీపీ సీనియర్‌ నాయకులు ఈవీ రమణ, ఈవీ శ్రీకాంత, కరీమ్‌బాషా తదితరులు ఉన్నారు.


Read more