జగన గద్దె దిగిపో..
ABN, First Publish Date - 2022-05-15T05:07:53+05:30
రాష్ట్రంలో ప్రజల ఆగ్రహ జ్వాలాలు కట్టలు తెంచుకుని ఎగిసి పడకముందే సీఎం జగన అధికార పీఠాన్ని వదిలి వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అద్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
- లేకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తారు
- సోమిశెట్టి హెచ్చరిక
కర్నూలు (అగ్రికల్చర్), మే 14: రాష్ట్రంలో ప్రజల ఆగ్రహ జ్వాలాలు కట్టలు తెంచుకుని ఎగిసి పడకముందే సీఎం జగన అధికార పీఠాన్ని వదిలి వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అద్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం పార్టీ ఆదేశాల మేరకు నగరంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకవైపు ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తూ.. మరోవైపు నిత్యావసరాల ధరలను పెంచి ప్రజలపై మోయలేని భారాలను ముఖ్యమంత్రి వేశారన్నారు. ఇక ఎంత మాత్రం భరించే పరిస్థితి లేదని, ప్రజలు నిర్ణయం తీసుకుంటున్నారని, త్వరలోనే జగనకు ప్రజలు బుద్ధ్ది చెబుతారని సోమిశెట్టి అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శులు నాగేంద్ర కుమార్, తెలుగు యువత ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, కార్పొరేటర్లు జాకీర్ అన్సారీ, విజయకుమారి, బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, చంద్రకళాబాయి, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.