-
-
Home » Andhra Pradesh » Kurnool » Flood to Tungabhadra-MRGS-AndhraPradesh
-
తుంగభద్రకు వరద
ABN , First Publish Date - 2022-05-15T04:17:44+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.
హాలహర్వి మే 14: కర్ణాటక రాష్ట్రంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఖరీఫ్ ప్రారంభ దశలోనే జలాశయానికి ఇనఫ్లో ద్వారా 5,765 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తుంగభద్ర బోర్డు డీఈ సురేష్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జూన నెలలో జలాశయానికి రావాల్సిన వరద నీరు ఈసారి మే నెలలోనే వస్తోందని అన్నారు. ఈసారి తాగు, సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా 1,595 అడుగులకు వరద చేరిందన్నారు. ప్రస్తుతం తుంగభద్ర దిగువ కాల్వ పనులకు మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు.

