-
-
Home » Andhra Pradesh » Kurnool » Driver issues to the attention of the CM Mayor-MRGS-AndhraPradesh
-
సీఎం దృష్టికి డ్రైవర్ల సమస్యలు : మేయర్
ABN , First Publish Date - 2022-05-15T05:01:25+05:30 IST
ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగర మేయర్ బీవై రామయ్య ప్రకటించారు.
కర్నూలు(కలెక్టరేట్), మే 14: ప్రభుత్వ వాహన డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నగర మేయర్ బీవై రామయ్య ప్రకటించారు. కర్నూలు నగరంలో అఖిల భారత ప్రభుత్వ వాహన డ్రైవర్ల 7వ జాతీయ మహాసభలు ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా స్థానిక సీ క్యాంపు సెంటర్లోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయ ఆవరణలో సంఘ వ్యవస్థాపకుడు కేఎం రసూల్ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో కాన్ఫడరేషన ఉపాధ్యక్షుడు, డ్రైవర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు అధ్యక్షతన సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్, డ్రైవర్ల కాన్ఫడరేషన జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిలాన రాజ్ బన్నీ, సందీప్ కుమార్ మౌర్య, రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. మహాసభలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జిల్లా అధ్యక్షులతో పాటు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

