అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-14T05:33:31+05:30 IST

బేతంచెర్ల పట్టణంలోని బైటిపేటలో నివాసముంటున్న ఉప్పరి మధుసూదన్‌ (32) అప్పుల బాధ భరించలేక గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

బేతంచెర్ల, మే 13: బేతంచెర్ల పట్టణంలోని బైటిపేటలో నివాసముంటున్న ఉప్పరి మధుసూదన్‌ (32) అప్పుల బాధ భరించలేక గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. డోన్‌ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాదర్‌బాషా తెలిపిన వివరాల మేరకు ఉప్పరి మధుసూదన్‌ కర్నూలు రహ దారిలో ఒక నాపరాళ్లు పాలిష్‌ చేసే ప్యాక్టరీని లీజుకు తీసుకుని నిర్వ హిస్తున్నాడు. ఫ్యాక్టరీ నిర్వహ ణకు సుమారు రూ.14 లక్షలు అప్పు చేశాడు. అప్పు ఇచ్చినవారు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురై హెచ్‌. కొట్టాల గ్రామ సమీపంలో రైల్వేగేటు వద్ద గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు. మృతునికి భార్య రమ్య చరణ్‌, కొడుకు, కుమార్తె సంతానం ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమ్మితం డోన్‌ ఆసు పత్రి కి తరలించి కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కాని స్టేబుల్‌ ఖాదర్‌బాషా తెలిపారు.

Read more