బీటెక్, లా ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2022-05-15T05:13:22+05:30
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరిగిన బిటెక్, లా పరీక్ష ఫలితాలను విడుదల చేశామని పరీక్షల విభాగం డీన్, ఫ్రొఫెసర్ కే విశ్వనాథరెడ్డి తెలిపారు.
కర్నూలు(అర్బన్) మే 14: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరిగిన బిటెక్, లా పరీక్ష ఫలితాలను విడుదల చేశామని పరీక్షల విభాగం డీన్, ఫ్రొఫెసర్ కే విశ్వనాథరెడ్డి తెలిపారు. శనివారం తన చాంబర్లో లా 3, 5 సంవత్సరాలు, 2,4,6,8 సెమిస్టర్ డిసెంబర్ 2021 పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆనందరావు ఆదేశాల మేరకు సెమిస్టర్ల వారీగా పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని పేర్కొన్నారు. 2వ సెమిస్టర్‌లో 3 సంవత్సరానికి 235 కి 232, 5వ సంవత్సరానికి 2వ సెమిస్టర్‌లో 45కు 28, 6వసెమిస్టర్‌లో 39కి 16, 8వ సెమిస్టర్‌లో 28కి 18 మంది ఉత్తీర్ణత సాధించారు. 3 వ సంవత్సరం 2వ సెమిస్టర్‌లో 77కు 77, 4వసెమిస్టర్‌లో 30కి 4, 5వ సంవత్సరం 2వ సెమిస్టర్‌లో 19కి 3, 4వ సెమిస్టర్‌లో 12కు 3, 6వ సెమిస్టర్‌లో 17కు 4, 8వ సెమిస్టర్‌లో 12కు 1 ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. బీటెక్ ఇంజనీరింగ్ విభాగంలో 4వ సెమిస్టర్‌లో 226 మందికి 140 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.