రేపు టీజీవీ కళాక్షేత్రంలో అష్టావధానం

ABN , First Publish Date - 2022-05-15T05:05:12+05:30 IST

నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ జన్మదిన సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ‘అష్టావధానం’ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు టీజీవీ కళాక్షేత్రంలో అష్టావధానం


కర్నూలు (కల్చరల్‌), మే 14: నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ జన్మదిన సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ‘అష్టావధానం’ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన ప్రముఖ శతావధాని ఆముదాల మురళి అష్టావధానం చేస్తారని, పుచ్ఛకులుగా అవధానం సుధాకర శర్మ (నిషిద్ధ్దాక్షరి), ఎస్‌ఎస్‌ పటేల్‌ (వ్యక్తాక్షరి), డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి (దత్తపది), డాక్టర్‌ వీ పోతన (ఆశువు), కెంగార మోహన (వర్ణన), పసుపులేటి నీలిమ (నామసమీకరణ), ఎస్‌ఎండీ ఇనాయతుల్లా (అప్రస్తుత ప్రసంగం), ఎస్‌ మహ్మద్‌ మియా (పురాణపఠనం) చేస్తారని ఆయన వివరించారు. సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.     


Read more