విద్యార్థి నాయకుల అరెస్టు

ABN , First Publish Date - 2022-05-14T05:43:37+05:30 IST

నంద్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.

విద్యార్థి నాయకుల అరెస్టు
బేతంచెర్లలో లాక్కెళ్తున్న పోలీసులు

నంద్యాల (నూనెపల్లె), మే 13: నంద్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉమ్మడి జిల్లాల్లోని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఈనెల 14వ తేదీన చలో రాజ్‌ భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్‌  జిల్లా అధ్యక్షుడు ధనుంజయు డు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రఫీ, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయుడు, ఏపీ స్టూడెంట్స్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వేణుమాధవ్‌ రెడ్డిని అరెస్టు చేసి త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఉంచారు.  డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శివను టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. 


డోన్‌ (రూరల్‌): ప్రజా సమస్యల పరిష్కారానికి తలపెట్టిన ఆందోళనలో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి నక్కి హరి, మండల అధ్యక్షుడు హబీబ్‌ బాషా అన్నారు. శనివారం రాజ్‌భవన్‌ (గవర్నర్‌) కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి వామపక్షాల పిలుపులో భాగంగా ఆందోళనలకు సిద్ధమవు తున్న డీవైఎఫ్‌ఐ నాయకులను డోన్‌ పట్టణ సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ముందస్తుగా శుక్రవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. 


బేతంచెర్ల: రాయలసీమ యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికై ఈ నెల 14న చలో రాజ్‌భవన్‌  ముట్టడికి బయలుదేరుతున్న ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు భార్గవ్‌ ఉదయ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు మధు కిరణ్‌, షేక్షావలి, ఎల్లకృష్ణ, ప్రదీప్‌, మహేష్‌లను శుక్రవారం పాతబస్టాండులో ఎస్‌ఐ శ్రీనివాసులు ముందస్తుగా  అరెస్టు చేసి   పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంత రం సాయంత్రం వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆనందరావు పూర్తిగా నియంతలా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని అన్నారు.  ఆయనను తక్షణమే రీకాల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  



Read more