ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

డీసీసీకి అహమ్మద్‌ ఆలీఖాన్‌ బై బై

ABN, First Publish Date - 2022-05-15T05:07:52+05:30

డీసీసీ పదవీకి రాజీనామా చేసినట్లు అహమ్మద్‌ ఆలీఖాన్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా


కర్నూలు(అర్బన్‌) మే 14: డీసీసీ పదవీకి రాజీనామా చేసినట్లు అహమ్మద్‌ ఆలీఖాన్‌ వెల్లడించారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ సేవల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, వ్యక్తిగత కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతానని, భవిష్యత్‌ కార్యాచరణపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మూడేళ్లుగా పార్టీపరంగా ఎన్నో కార్యాక్రమాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టామని గుర్తు చేసుకున్నారు. తనకు అండగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారలోకి వస్తేనే దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!