-
-
Home » Andhra Pradesh » Kurnool » Ahmed Ali Khan bye bye to DCC-MRGS-AndhraPradesh
-
డీసీసీకి అహమ్మద్ ఆలీఖాన్ బై బై
ABN , First Publish Date - 2022-05-15T05:07:52+05:30 IST
డీసీసీ పదవీకి రాజీనామా చేసినట్లు అహమ్మద్ ఆలీఖాన్ వెల్లడించారు.
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా
కర్నూలు(అర్బన్) మే 14: డీసీసీ పదవీకి రాజీనామా చేసినట్లు అహమ్మద్ ఆలీఖాన్ వెల్లడించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ సేవల్లో కొత్త వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, వ్యక్తిగత కారణాల వల్లే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతానని, భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మూడేళ్లుగా పార్టీపరంగా ఎన్నో కార్యాక్రమాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టామని గుర్తు చేసుకున్నారు. తనకు అండగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వస్తేనే దేశానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు.

