వైభవంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ

ABN , First Publish Date - 2022-05-14T06:11:28+05:30 IST

వైభవంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ

వైభవంగా విగ్రహాల పునఃప్రతిష్ఠ
విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవంలో భక్తులు

ఉంగుటూరు, మే 13 :  తరిగొప్పల శ్రీదుర్గా మల్లికార్జునస్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. కాళ్లకూరుకు చెందిన ప్రముఖ వీరశైవ ఆగమపండితులు భోగేశ్వరశర్మ, 30 మంది శిష్య బృందంచే ఉదయం 9. 24గంలకు ఏకకాలంలో గణపతి, శివలింగ, దుర్గాదేవి,   వీరభద్రస్వామి, కుమారస్వామి, ద్వారపాలకులు, నందీశ్వర, చండీశ్వర, నవగ్రహ నాగబంధ శ్రీదక్షిణామూర్తి, కాళభైరవ విగ్రహాల ప్రతిష్ఠలతోపాటు, జీవధ్వజశిఖర, ఆలయశిఖర ప్రతిష్ఠలు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా దేవదాయశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎస్‌.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ ఈవో యార్లగడ్డ శ్రీనివాసరావు అలియాస్‌ వాసు-పద్మ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.  జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ దుట్టా సీతారామలక్ష్మి, రాష్ట్ర వైసీపీ వైద్యవిభాగం అధ్యక్షుడు డాక్టర్‌ గోసుల శివభరత్‌రెడ్డి, వైసీపీ నాయకులు దుట్టా రవిశంకర్‌,  సర్పంచ్‌ యాండ్రపు అనిత, ఎంపీటీసీ తెన్నేటి నటరాజ్‌,  కోటగిరి రామ్మోహనరావు, డాక్టర్‌ సత్యనారాయణ, కిషోర్‌,  ప్రత్యేకపూజలు నిర్వహించారు.  

Read more