ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బుడమేరు కరకట్టకు మరమ్మతులు చేయాలి

ABN, First Publish Date - 2022-05-14T05:52:11+05:30

హెచ్‌.ముత్యాలంపాడు వద్ద భారీగా కోతకు గురైన బుడమేరు కట్టకట్టలకు తక్షణం మరమ్మతులు చేసి రైతుల, ప్రజల ఇబ్బందులను తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

కోతకు గురైన బుడమేరు కట్టను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జి.కొండూరు, మే 13 : హెచ్‌.ముత్యాలంపాడు వద్ద  భారీగా కోతకు గురైన బుడమేరు కట్టకట్టలకు తక్షణం మరమ్మతులు చేసి రైతుల, ప్రజల ఇబ్బందులను తొలగించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.   శుక్ర వారం కోత ప్రాంతాన్ని  పరిశీలించారు. కట్ట దెబ్బతిన నెలలు గడు స్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయ మన్నారు. నిత్యం రద్దీగా ఉండే కట్ట దెబ్బతినడంతో రైతులు వారి పొలాల్లోకి వెళ్లి వచ్చేం దుకు నానా పాట్లు పడుతున్నారన్నారు. వర్షాలు పడి బుడమేరు నిండుగా వస్తే దెబ్బతిన్న చోట కట్టకు గండి పడితే  400ఎకరాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు గొప్పగా చెప్పుకునే జగనన్న కాలనీ కూడా ఇక్కడ గండి పడితే మునగడం ఖాయమన్నారు. వెల్లటూరు, కందులపాడు, హెచ్‌.ముత్యాలంపాడు, చేగిరెగ్డిపాడు గ్రామాలకు చెందిన రైతులు పండించే పంట రవాణా చేసుకునేందుకు ఆధారం ఈకట్ట మాత్రమే అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి దెబ్బతిన్న బుడమేరు కాల్వ కట్టకు తక్షణం మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, ఆలూరి రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!