-
-
Home » Andhra Pradesh » Krishna » RTC vs Muncipality-NGTS-AndhraPradesh
-
ఆర్టీసీ వర్సెస్ మున్సిపాలిటీ
ABN , First Publish Date - 2022-05-14T06:21:16+05:30 IST
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఫౌంటెన్ నిర్మాణం పేరుతో పురపాలకసంఘం చేపట్టిన పనులను ఆర్టీసీ డీఎం శుక్రవారం అడ్డుకోవటం సంచలనం కలిగించింది.
బస్టాండులో ఫౌంటేన్ పేరుతో దురాక్రమణకు మున్సిపాలిటీ యత్నం
కమిషనర్‌పై ఆర్టీసీ డీఎం ఫిర్యాదు
పోలీసుల రాకతో నిలిచిపోయిన పనులు
జగ్గయ్యపేట, మే 13 : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఫౌంటెన్ నిర్మాణం పేరుతో పురపాలకసంఘం చేపట్టిన పనులను ఆర్టీసీ డీఎం శుక్రవారం అడ్డుకోవటం సంచలనం కలిగించింది. కొద్దిరోజులుగా బస్టాండులో ఇన్, ఔట్ గేట్ మధ్య ఉన్న కొద్దిపాటి స్థ లంలో వాటర్ ఫౌంటెన్, ఆర్వో ప్లాంటు ఏర్పాటుకు పురపాలకసంఘం ప్రయత్నాలు చేస్తు వచ్చింది. గురువారం ఉద యం ఆ స్థలంలో గుంత తీసేందుకు యత్నించగా ఆర్టీసీ సి బ్బంది అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉద యం కమిషనర్ కొంతమంది కార్మికులు, ఒక ప్రజాప్రతినిధితో కలిసి యంత్రాలతో పునాదులు తీసేందుకు వచ్చారు. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న ఆర్టీసీ డీఎం సుబ్బన్నరెడ్డి హూటాహుటిన బస్టాండ్‌కు వచ్చి పనులు ఆపాలని కోరారు. దీంతో ఆర్టీసీ అధికారులకు, కమిషనర్‌కు వాగ్వాదం జరిగింది. బస్టాండుకు ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని, కాబట్టి ఈ స్థలం పురపాలక సంఘానికి ఎలా అవుతుందని డీఎం ప్రశ్నించారు. గతంలో ఆ స్థలాన్ని హోటల్‌కు లీజుకిచ్చి ప్ర మాదాలు జరుగుతున్నాయని తొలగించామన్నారు. తమ స్థ లంలో వృద్ధులు, ప్రయాణికులు కూర్చొనేందుకు వీలుగా బ ల్లలు వేయించామని కమిషనర్ వాదించారు. బస్టాండు సె క్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం, డీ ఎం పోలీసుల దృష్టికి తీసుకెళ్లటంతో సీఐ చంద్రశేఖర్, ఎస్సై రామారావులు అక్కడికి వచ్చి ఇరుశాఖల అధికారులతో చర్చించి పను లు ఆపేశారు.
కబ్జాపై డీఎం ఫిర్యాదు
పురపాలక సంఘం తమ స్థలాన్ని కబ్జా చేస్తుందని ఆర్టీసీ డీఎం సుబ్బన్నరెడ్డి నందిగామ ఏసీపీకి, జగ్గయ్యపేట సీఐ, ఎస్సైలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. బస్టాండుకు తాము ఆస్తిపన్ను చెల్లిస్తున్నామని, అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలుపుదల చేయించి, అధికారిక కబ్జా నుంచి కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థలం ఎవరిదో పరిశీలిస్తున్నాం : కమిషనర్
బస్టాండ్ ఇన్, ఔట్ గేట్ల మధ్య స్థలం ఎవరిదో రికార్డులు పరిశీలిస్తున్నామని కమిషనర్ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. పట్టణ ఆధునీకరణ, సుందరీకరణలో భాగంగా బస్టాండు వద్ద ఫౌంటెన్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టటం లేదని స్థలం ఎవరిదో తెలుసుకుంటున్నామని, ఆర్టీపీ ఇచ్చిన రికార్డులను పరిశీలిస్తున్నామన్నారు.

