ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆపరేషన్‌.. మెట్రో!

ABN, First Publish Date - 2022-05-14T06:22:02+05:30

మెట్రో డొక్కు బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది! ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో డొక్కు బస్సుల పని పట్టాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి ఆర్టీసీ స్పందన  

మెట్రో డొక్కు బస్సులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆర్టీసీ ఈడీ

తక్షణం 40 బస్సుల మరమ్మతులకు గుర్తింపు  

గ్యారేజీలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు 

రెండు నెలల్లో పూర్తి 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : మెట్రో డొక్కు బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించింది! ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో డొక్కు బస్సుల పని పట్టాలని నిర్ణయించింది. ‘క్షణ క్షణం ప్రాణాంతకం’ పేరుతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రత్యేక కథనం నేపథ్యంలో ప్రయాణికులకు పరీక్ష పెడుతున్న మెట్రో డొక్కు బస్సులను గుర్తించారు. ఈ బస్సులను గ్యారేజీల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. రెండు నెలల్లో బస్సులన్నింటిని బలోపేతం చేసి రోడ్లపైకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించి బాగుచేయిస్తున్న ఆర్టీసీ అధికారులు అభినందనీయులు. విజయవాడ జోన్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ రీజియన్‌లో సిటీ బస్సులుగా తిరిగే మెట్రో బస్సులు అధ్వాన్న స్థితిలో ఉండి ప్రయాణికులకు పరీక్షలు పెడుతున్న అంశాలపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఆర్టీసీ వర్గాలను కదిలించింది. ఎన్ని మెట్రో బస్సులు పాడయ్యాయో వాస్తవ నివేదిక ఇవ్వాలని విజయవాడ ఆర్టీసీ జోన్‌ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అధికారులు డిపోల వారీగా సర్వే చేసి రిపోర్టు కోరారు. మొత్తం 40 బస్సులు అసౌకర్యంగా ఉన్నాయని గుర్తించారు. ఈ బస్సులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులకు ఈడీ నిర్దేశించారు. ప్రస్తుతం ఆయా డిపోల్లో రెండేసి బస్సుల చొప్పున మరమ్మతులు చేపడుతున్నారు. వర్క్‌షా్‌పలో బాడీ మొత్తం ఊడదీపి దుర్భేద్యం చేస్తున్నారు. దృఢమైన మెటీరియల్‌తో రీఫర్బిష్డ్‌ చేస్తున్నారు. బాడీలు ఊగి పోతుండటంతో వాటిని విడదీసి ఫ్లోర్‌, రూఫ్‌లను అనుసంధానం చేసే సైడ్‌ క్రాష్‌ బ్యారియర్‌ ఐరన్‌ రాడ్స్‌ను కొత్తవి ఏర్పాటు చేసి దుర్బేధ్యమైన బాడీ ఫ్రేమ్‌ తయారు చేసి బస్సుకు అమర్చుతున్నారు. సీటింగ్‌ లోపాలను సరిచేస్తున్నారు. మొత్తంగా డొక్కు బస్సులకు దండిగా మెటీరియల్‌ వాడి, విడి భాగాలు ఏర్పాటు చేసి కొత్త బస్సులా తీర్చి దిద్దనున్నారు. బాడీ ఫ్రేమింగ్‌ ముగించి బస్సును దుర్భేద్యం చేసిన తర్వాత పెయింటింగ్‌ పనులు చేపడతారు. ఇలా రోజూ రెండు బస్సులను సరికొత్తగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 

రెండు నెలల్లో సరికొత్తగా మెట్రో బస్సులు 

ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించటం మా విధి! అందుకే మెట్రో బస్సుల్లో ఎన్ని పాడయ్యాయో పరిశీలించి మొత్తం 40 బస్సులను గుర్తించాం. వీటన్నింటినీ రెండు నెలల్లో సరికొత్తగా ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకు వస్తాం. ఒకసారి బస్సులను పునరుద్ధరించిన తర్వాత అవి ఎంత బాగుంటాయో చూడండి! రోజుకు రెండు బస్సుల చొప్పున మరమ్మతులు చేస్తున్నాం. బస్సులన్నీ రెండు నెలల్లో దుర్భేద్యంగా తయారౌతాయని అధికారులు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!