రైల్వేగేటు వద్దే అండర్‌పాస్ నిర్మించాలి
ABN, First Publish Date - 2022-05-14T06:07:44+05:30
రైల్వేగేటు వద్దే అండర్‌పాస్ నిర్మించాలి
హనుమాన్‌జంక్షన్ రూరల్, మే 13 : రైల్వేగేటు వద్దే అండర్‌పాస్ నిర్మించాలనిడిమాండ్ చేస్తూ వేరేచోట నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులను కోడూరుపాడు గ్రామస్థులు శుక్రవారం నిలిపి వేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభలో చెప్పి, చూపిన మాస్టర్ ప్లాన్ ప్రకారం పనుల నిర్వహించ కుండా డిజైన్ మార్చి వేరే చోట అండర్ పాస్ నిర్మించడానికి కారణమేమిటని రైల్వే అసిస్టెంట్ ఇంజనీర్ సంతోష్ కుమార్, సెక్షన్ డివిజనల్ ఇంజనీర్ జాన్‌విజయ్‌లను గ్రామస్థులు ప్రశ్నించారు. గతంలో చెప్పిన విధంగా నిర్మించడం వల్ల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులైన పామాయిల్, చెరుకు, గడ్డి లాంటి వాటిని ఎత్తుగా లోడు వేయడం కుదరదని, కొన్ని ఇళ్ల్లు కూడా తొలగించాల్సిరావడం వల్ల డిజైన్ మార్చడం జరిగిందని రైల్వే అధికారులు గ్రామస్థుల కు వివరించారు. తమ ఎమ్మెల్యే వంశీకి ఈ సమస్య ను తెలియజేస్తామని, ఆయన అభిప్రాయం వెల్ల డించే వరకూ పనులు నిలిపివేయాలని గ్రామస్థులు కోరడంతో రైల్వే అధికారులు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గరికపాటి పుల్లయ్య, చందు శ్రీని వాసరావు, అంబటి రాజేష్, ఆళ్ల భాను, రంగారావు, బాలకృష్ణ, వెంకటేశ్వరరావు, జమలయ్య, గోవిందయ్య, తదితరులు పాల్గొన్నారు.