-
-
Home » Andhra Pradesh » Krishna » mahilalaku raksha disha app-NGTS-AndhraPradesh
-
మహిళలకు రక్ష దిశా యాప్
ABN , First Publish Date - 2022-05-14T06:06:11+05:30 IST
మహిళలకు రక్ష దిశా యాప్
ఎస్పీ సిద్ధార్థ కౌశల్
హనుమాన్‌జంక్షన్, మే 13 :దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం ప్రభు త్వం తెచ్చిన దిశా యాప్ మహిళల ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. శుక్రవారం దిశా యాప్ డౌన్లోడు ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని ఎస్పీ పరిశీలిం చారు. ఆర్టీసీ బస్సుల్లోకి వెళ్లి మహిళల చేత యాప్ ను డౌన్లోడు చేయించారు. ప్రయాణికుల్లో దిశాయాప్ పై అవగాహన కల్పించారు. బస్టాండ్‌కు వచ్చే ప్రతి బస్సులోకి వెళ్లి ప్రయాణికు చేతల దిశాయాప్ డౌన్లోడు చేయించాలని ఎస్సైలు టి.సూర్య శ్రీనివాస్, కె.ఉషారాణిలను ఆదేశించారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యాప్ ద్వారా కష్టాల్లో ఉన్న మహి ళలకు తక్షణ సాయం అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష ఫోన్లలో యాప్‌ను డౌన్లోడు చేసే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలి పారు. మచిలీపట్నం, గుడివాడ పట్టణాల్లో ఈ కార్యక్ర మం పట్ల ప్రజల్లో స్పందన బాగుందన్నారు. హను మాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్‌లో డోన్‌లోడ్ ప్రక్రి యను పరిశీలించిన అనంతరం గన్నవరం వెళ్లారు. దీనికి ముందు ఎస్సైలు. టి.సూర్య శ్రీనివాస్, కెఉషా రాణి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు 1400 ఫోన్‌ల్లో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో..
గన్నవరం : దిశా యాప్ ఫోన్‌లో ఉంటే కనిపిం చని ఖాకీ కాపల ఉన్నట్లే అని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ అన్నారు. మండలంలోని కేసరపల్లి డాక్టర్ ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో శుక్ర వారం దిశా యాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దిశా యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసు కోవాలన్నారు. యాప్ ఉంటే మహిళల కు రక్షణ ఉన్నట్లే అన్నారు. మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా యాప్‌ను ఉప యోగిస్తే తక్షణమే న్యాయం జరుగు తుందన్నారు. అందరూ యాప్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. డీఎస్పీ కె. విజ య్‌పాల్, ఎంపీపీ అనగాని రవి పాల్గొన్నారు.
ఉయ్యూరులో..
ఉయ్యూరు : మహిళలకు భద్రత కల్పించే దిశా యాప్ ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకో వాలని తహసీల్దార్ కె.నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రధాన సెంటర్‌లో పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో దిశాయాప్ డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని శుక్రవారం తహసీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దిశా యాప్ మహిళలకే కాక అందరికీ ఉపయోగపడుతుందన్నారు. సీఐ కాశీవిశ్వనాథ్, పట్టణ ఎస్సై వీరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఆఽధ్వర్యంలో కాటూరు రోడ్డులో దిశా యాప్ డౌన్‌లోడ్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
తాడిగడపలో..
పెనమలూరు : దిశా యాప్‌పై ప్రతి యువతి, మహి ళకు అవగాహన ఉండాలని ఎమ్మెల్యే కె. పార్థసారథి అన్నారు. శుక్రవారం తాడిగడప జంక్షన్ వద్ద దిశా యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలో చదువుతున్న చిన్నారులు, యువతుల దగ్గర నుండి ఉద్యోగాలు చేస్తున్న, గృహి ణులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళకు దిశా యాప్‌పై అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలను ఎదుర్కోవా లంటే దిశా యాప్‌ను ఆయుధంగా వినియోగించుకో వాలన్నారు. ప్రతి ఒక్క మహిళ తమ మొబైల్‌లో దిశా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకో వాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు యాప్ ద్వారా సమాచారాన్ని అందిస్తే క్షణాల్లో పోలీసులు స్పంది స్తారన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజియనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, డీసీపీ విజయపాల్, సీఐ సత్యనారాయణ, తహసీల్దారు భద్రు, ఎంపీడీవో విమాదేవి తదితరులు పాల్గొన్నారు.

