కల్తీ ఎరువులు తయారు చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2022-05-14T06:09:17+05:30 IST

కల్తీ ఎరువులు తయారు చేస్తే కఠిన చర్యలు

కల్తీ ఎరువులు తయారు చేస్తే కఠిన చర్యలు
గోడౌన్‌ను పరిశీలిస్తున్న ఏడీఏ జయప్రద

  గన్నవరం, మే 13 : కల్తీ ఎరువులు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఏ జయ ప్రద హెచ్చరించారు. మండలంలోని సూరంపల్లి పారిశ్రామికవాడలోని గోడౌన్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం, సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కల్తీ ఎరువుల తయారీపై కేసు నమోదు కావడంతో అక్కడ వ్యవహారం సూరంపల్లి వరకు పాకడంతో అధికారులు తనిఖీలు   చేపట్టారు. ఈ మేరకు ఏడీఏ జయప్రద, ఏవో తేజస్వి, ఎస్సై రమేష్‌బాబు, వీఆర్వో సుృజన్‌ సం యుక్త ఆధ్వర్యంలో గోడౌన్‌ను తనిఖీ చేశారు. 25 కేజీల ఎర్రరంగు పౌడర్‌ను గుర్తించారు. ఆ గోడౌన్‌ లో ఎరువులు తయారు చేసిన స్థలం గుర్తిం చారు. గత రెండు రోజుల క్రితం అధికారులు నిర్వ హించిన తనిఖీలలో పట్టుబడిన రామ్మోహనరావు అలియాస్‌ రాంబాబు ఈ గోడౌన్‌ను అద్దెలకు ఇచ్చుకుని ఎరువులు విక్రయుస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించారు. 25 కేజీల నకిలీ ఎర్ర పౌడర్‌ను శాంపిల్‌ తీసి పరీక్షల నిమిత్తం తాడేపల్లిగూడెం ఎరువుల పరీక్ష కేంద్రానికి పంపించినట్లు ఏడీఏ జయప్రద తెలిపారు.

Read more