-
-
Home » Andhra Pradesh » Krishna » gold theft in durgamma temple-NGTS-AndhraPradesh
-
ఇంటిదొంగ దొరికాడు..?
ABN , First Publish Date - 2022-05-14T05:58:44+05:30 IST
ఇంటిదొంగ దొరికాడు..?
నేడో, రేపో అరెస్టు చూపించే అవకాశం
విజయవాడ, మే 13 (ఆంధ్రజ్యోతి) : కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కాజేసేందుకు ప్రయత్నించిన ఇంటిదొంగను పోలీసులు పట్టేశారా? నేడో, రేపో నిందితుడి అరెస్టు చూపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఆధారంగా హుండీల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న వారిలో బాత్రూమ్కు వెళ్లొచ్చిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే అమ్మవారి సొత్తును కాజేసేందుకు ప్రయత్నించిన ఇంటిదొంగను పట్టేసినట్టు విశ్వసనీయ సమాచారం. అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి ఉద్యోగే దీనికి కారణమని పోలీసులు గుర్తించారని, నేడో, రేపో అరెస్టు చూపే అవకాశముందని భావిస్తున్నారు.

