ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఏదీ సంక్షేమం..?

ABN, First Publish Date - 2022-05-14T06:08:16+05:30

పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మికి అడుగడుగునా చుక్కెదురైంది.

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును, మేయర్‌ను నిలదీస్తున్న మహిళ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఏదీ సంక్షేమం..?

 46వ డివిజన్‌లో ఎమ్మెల్యే వెలంపల్లి,

 మేయర్‌కు సమస్యల స్వాగతం

అడుగడుగునా అడ్డుకున్న మహిళలు

చిట్టినగర్‌, మే 13 : పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్‌లో శుక్రవారం జరిగిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మికి అడుగడుగునా చుక్కెదురైంది. 

ఫ గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల కోసం డబ్బు కట్టాం. మూడేళ్లవుతున్నా ప్రసుత్త ప్రభుత్వం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ ఎమ్మెల్యే , మేయర్‌ను నిలదీసింది. పెరిగిన నిత్యావసర, గ్యాస్‌, పెట్రోలు ధరలతో పాటు పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్‌ బిల్లు, పన్నుల భారాలతో అవస్థలు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఫ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకేమీ అందలేదని, రేషన్‌కార్డు, అమ్మ ఒడి, విద్యాదీవెన ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇళ్ల పట్టాలిస్తామన్నారని, మూడేళ్లయినా ఏదీ లేదని, సంక్షేమ పథకాల్లో ఆంక్షలు పెట్టి కోతలు విధిస్తున్నారని మరో మహిళ పేర్కొంది. ఇదేనా సంక్షేమం.. అంటూ నిలదీసింది. 

ఫ కృష్ణానది సమీపంలోనే ఉన్నా మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, నీరు రంగుమారి వస్తోందని, పనులకు వెళ్లే సమయంలో నీరు వదిలేతే మంచినీరు ఎలా పట్టుకోవాలని కొంతమంది మహిళలు నిలదీశారు. కరోనా కారణంగా మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. అడ్డగోలుగా పన్నులు పెంచి భారాలు మోపటమేమిటని.. వారంతా ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లులపై అడగ్గా, అవేం పెరగలేదని ఎమ్మెల్యే నోటి మాటతో సర్దిచెప్పి పక్కకు వెళ్లిపోయారు. 

రాజకీయ నాయకులు కాదు కదా...

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇస్తాం, సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందిస్తామని చెప్పారు. స్థలమిచ్చారు సరే.. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోమంటే ఎక్కడి నుంచి తేవాలని ఓ మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించింది. ప్రభుత్వమే కట్టి ఇస్తుందని ఎమ్మెల్యే చెప్పగా, మొదట ఉచితం అని, ఇప్పుడు రూ.లక్ష తమ వాటాగా కట్టాలని చెబుతున్నారని ఆమె పేర్కొంది. మీరే రాజకీయ నాయకుల్లా అన్నీ చెబుతున్నారు. రాజకీయ నాయకులు కాదు కదా.. అంటూ ఎమ్మెల్యే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 46వ డివిజనులో ఐదు బైకులను దహనం చేసిన నిందితులను పట్టుకునేందుకు కొత్తపేట పొలీసులు నాలుగు బృందాలతో చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి వారైనా చర్యలు తప్పవని, పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!