-
-
Home » Andhra Pradesh » Krishna » ella nirmanam vegavantham chiyandi-NGTS-AndhraPradesh
-
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-14T06:13:01+05:30 IST
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
ఉంగుటూరు, మే 13 : మండల పరిధిలోని జగనన్న లేఅవుట్లలో గృహనిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీడీవో కె.జ్యోతి సూచించారు. శుక్రవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఓటీఎస్, ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్, సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ ఏఈ మండవ సురేష్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఏపీవో ఎస్ అశోక్‌కుమార్, పంచాయతీ కార్యదర్శులు నర్రా ప్రసాద్, టి.శివప్రసాద్, జి.రత్నకిషోర్, జి, సత్యసాయిబాబు, జి.అప్పారావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
విజయవాడ రూరల్‌లో..
విజయవాడ రూరల్ : మండలంలో సంక్షేమ పథకాల అమలుపై అధికారులంతా దృష్టి పెట్టాలని ఎంపీడీఓ సునీత కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలోని అన్ని లే అవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మండల పరిషత్ ఏవో శకుంతల, ఈవోఆర్‌డీ బీఎల్‌వీ శేషగిరిరావు పాల్గొన్నారు.

