బాదుడు ఘనం.. అభివృద్ధి శూన్యం
ABN, First Publish Date - 2022-05-14T05:48:29+05:30
రాష్ట్రంలో పన్నుల భారం తప్ప.. అభివృద్ధిలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
తెల్లదేవరపాడులో మాజీమంత్రి ఉమా
జి.కొండూరు, మే 13: రాష్ట్రంలో పన్నుల భారం తప్ప.. అభివృద్ధిలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తెల్లదేవరపాడులో శుక్రవారం బాదుడే- బాదుడులో లాంతర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఇంటిం టికీ తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువారుత పెరిగిన ధరలు, గతంలో ఉన్న ధరలను వివరిస్తూ కర పత్రాలను పంచారు. అనంతరం మాట్లాడుతూ ఒక్కచాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ధరలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. టీడీపీ వస్తే తప్ప రాష్ట్ర పాలన గాడిలో పడదని, ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు, ఉయ్యూరు వెంకట నరసింహారావు, పజ్జూరు రవికుమార్, లంక రామకృష్ణ, బూర్సు శివ, లంక లితీష్, పొన్నగంటి