ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కరకట్ట రోడ్డు విస్తరణకు భూ సేకరణ

ABN, First Publish Date - 2022-05-14T06:11:58+05:30

అమరావతి రాజధాని కరకట్ట రోడ్డు విస్తరణకు అవసరమైన భూ సేకరణకు శుక్రవారం రైతులతో సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.

సమావేశం నిర్వహిస్తున్న సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, చిత్రంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కరకట్ట రోడ్డు విస్తరణకు భూ సేకరణ 

 రైతులతో సమావేశం నిర్వహించిన సీఆర్‌డీఏ కమిషనర్‌

పాల్గొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

సానుకూలంగా స్పందించిన రైతులు 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

అమరావతి రాజధాని కరకట్ట రోడ్డు విస్తరణకు అవసరమైన భూ సేకరణకు శుక్రవారం  రైతులతో సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. కరకట్ట విస్తరణకు 1.30 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తోంది. ఈ క్రమంలో భూమిని సేకరించాల్సిన పొలాలకు సంబంధించి యజమానులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి మొత్తం 31 మంది రైతులు హాజరయ్యారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌తో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. ల్యాండ్స్‌ విభాగం జేడీ చిరంజీవి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా రైతుల నుద్దేశించి సీఆర్‌డీఏ కమిషనర్‌ మాట్లాడారు. కరకట్ట రోడ్డును విస్తరిస్తున్న కారణంగా స్వల్పంగా భూమిని సేకరించాల్సి వస్తోందని తెలిపారు. రైతులకు  ఇబ్బంది లేకుండా భూ సేకరణ చేస్తామని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రోడ్డు విస్తరణ వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని, భూముల ధరలు కూడా పెరుగాతయని తెలిపారు. రైతులు సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవా ల్సిందిగా మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి కోరారు. రైతులంతా దాదాపుగా సానుకూలతను  వ్యక్తం చేశారు. ఎంత భూ సేకరణ అవసరం ? తమ పొలాల నుంచి ఎంత మేర సేకరించాలను కుంటున్నారన్న దానిపై స్పష్టత కోరారు. ప్రాథమికంగానే సర్వే చేయటం జరిగిందని, మీరు సానుకూలతను ప్రదర్శించినందున సమగ్ర సర్వే నిర్వహించి మీ ముందుకు మరోసారి వస్తామని కమిషనర్‌ విన్నవించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి సమస్యలన్నింటినీ పరిష్కరించటానికి అనేక సార్లు సమావేశ మౌతామని తెలిపారు. రైతులు సానుకూలంగా స్పందించినందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిలు రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 

అమరావతి రాజధానిలో హైకోర్టుకు రాకపోకలకు అనువుగా ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపుడి వరకు కరకట్ట రోడ్డు విస్తరణకు కిందటేడాది ముఖ్యమంత్రి జగన్‌  శంకుస్థాపన చేశారు. అయితే పనులు మొదలు కాలేదు. ప్రకాశం బ్యారేజి నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డు 16 కిలోమీటర్ల మేర ఉంది. ఈ మొత్తం దూరం కరకట్ట రోడ్డును విస్తరించటానికి రూ. 150 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించారు. నిధుల సమస్య ఏర్పడటంతో చాలా కాలం పనులు ప్రారంభించలేదు. తాజాగా కరకట్ట రోడ్డు పనులు చేపట్టారు. తొలి దశలో రూ. 70 కోట్లతో కరకట్ట విస్తరణ పనులు చేపడుతున్నారు. తొలి దశలో ఎకరంన్నర భూమిని సేకరించాల్సి రావటంతో రైతులతో సంప్రదింపులు జరిపారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!