ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

AP News: నందిగామ రాళ్లదాడి ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-11-07T12:47:13+05:30

నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్ల దాడి యత్నం ఘటనపై గవర్నర్‌కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అమరావతి: నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు (chadrababu naidu)పై రాళ్ల దాడి యత్నం ఘటనపై గవర్నర్‌ (AP Governor) బిశ్వభూషణ్ హరిచందన్‌ (Biswabhushan Harichandan)కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేశారు. రాళ్ల దాడి ఘటనపై నామాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేయటాన్ని తప్పు పడుతూ గవర్నర్‌ను టీడీపీ నేతలు ఆశ్రయించారు. ఘటనకు సంబంధించి అనుమానితుల ఫోటోలు కూడా టీడీపీ అధిష్టానం విడుదల చేసింది.

గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla ramaiah) మీడియాతో మాట్లాడుతూ... పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే చంద్రబాబుపై దాడి యత్నం జరిగిందన్నారు. 324 చట్టం కింద కేసు పెట్టి పోలీసులు హాస్యాస్పదంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖలో మంత్రి కారుకు దెబ్బ తగిలితే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. ఇక్కడ దాడి జరిగి రక్తం కారినా బెయిల్ బుల్ సెక్షన్ పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారన్నారు.

బోండా ఉమా(Bonda uma) మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లను దగ్గరుండి పోలీసులే ప్రోత్సహించారన్నారు. కాబోయే ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే రూ.100ఫైన్ కట్టి బెయిల్ మీద బయటకొచ్చే పెట్టీ కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకున్న తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. నామమాత్రపు కేసు నమోదు చేయడంపై గవర్నర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు.

Updated Date - 2022-11-07T12:57:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!