-
-
Home » Andhra Pradesh » Kadapa » VRY dies with dishwire short circuit-MRGS-AndhraPradesh
-
డిష్ వైర్ షార్ట్‌సర్క్యూట్‌తో వీఆర్యే మృతి
ABN , First Publish Date - 2022-05-15T04:52:34+05:30 IST
రాజంపేట మండలం పోలి గ్రామ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం(40) శనివారం రాత్రి డిష్‌వైర్ షార్ట్‌సర్క్యూట్‌తో మృతి చెందారు.
రాజంపేట టౌన్, మే14: రాజంపేట మండలం పోలి గ్రామ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం(40) శనివారం రాత్రి డిష్‌వైర్ షార్ట్‌సర్క్యూట్‌తో మృతి చెందారు. వివ రాల్లోకెళితే.. సుబ్రహ్మణ్యం తన ఇంట్లోని టీవీ రిపేరు చేయించుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో డిష్‌వైర్ కనెక్షన్ ఇస్తుండగా డిష్‌కనెక్షన్ షాక్ తగిలిదంఇ. దీంతో సుబ్రహ్మణ్యం కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుబ్రహ్మ ణ్యం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై రాజంపేట రూరల్ ఎస్‌ఐ భక్తవత్సలం మాట్లాడుతూ వీఆర్యే డొంకా సుబ్రహ్మణ్యం మృతి విషయం తెలిసిం దని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.

